నోట్ల
రద్దు అన్నది మన పాలకులు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రమూ కాదు.
నల్లధనాన్ని వెలికితీతకు కూడా కాదు. దేశంలో విదేశీ పెట్టుబడులకు ఘనంగా
స్వాగతం పలకడానికి ముందస్తు అంచనాలతో వేసిన పెద్ద ఎత్తుగడ ఇది నోట్ల
రద్దు వలన దేశీయంగా ఉన్న చిన్న పరిశ్రమలు , చిల్లర వ్యాపారాలు పూర్తిగా
చితికిపోతేనే పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు (ఎఫ్ డి.ఐ ) చిల్లర వర్తక
రంగం లోకి వస్తాయి వీటిలో నగదు రహిత చెల్లింపులు ద్వారా మాత్రమె
లావాదేవీలు జరుగుతాయి అందువల్లే మన పాలకులు ఈ నగదు రహిత చెల్లింపుల
విషయాన్నే తమ భజన మీడియా ద్వారా అధిక ప్రచారం చేస్తున్నారు. దీనికోసం
బ్యాంకుల ద్వారా నగదు డ్రా చేసుకోవడం పై ఆంక్షలు విధించేసారు. ఏ టీ ఎమ్
లలో కూడా కావాలనే నగదు అందుబాట్లో ఉంచడం లేదు నల్లధనం నియంత్రణ జరగలేదు
సామాన్య జనం కేవలం రూ.2వేల నోటు కోసం ఏ టీ ఎమ్ ల ముందు పడిగాపులు పడుతున్న
సమయం లోనే అవే నోట్లు కట్టలు కట్టలు గా నల్లధనులకు చేరిపోయాయి ఎక్కువ
చెలామణి లో ఉండాల్సిన రూ.100 నోట్లను కూడా మాయం చేసేసారు. ఈ దేశప్రజల దగ్గర
వారు శ్రమపడి సంపాదించిన సొమ్ము లేక పోతేనే వారంతా విదేశీయుల మాల్స్ లో,
పరిశ్రమల లో తక్కువ వేతనాలకు బానిసలు గా పనిచేస్తారు అప్పటికి మనపాలకులు
విదేశీయుల పెత్తనం కింద దళారీ పాలకులుగా మారి స్వంత ఆదాయాలను పెంచుకుంటారు
గతం లో కేవలం బ్రిటీష్ వాళ్ళు మాత్రమే మన స్వాతంత్రత ని హరించారు.
కానీ మన స్వార్ధ పాలకుల వలన మరోసారి ఈ దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు
అప్పగించే ప్రయత్నానికి నాందీ ప్రస్తావన ఈ నోట్లు రద్దు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి