తెలుగు భాషలోనే కాకుండా రష్యన్ సాహిత్యాన్నీ, చరిత్రనూ, శాస్త్రీయ
విజ్ఞానాన్నీ అనువాదాల రూపంలో పాఠకలోకానికి అందించిన సవ్యసాచి డాక్టర్
ఉప్పల లక్ష్మణరావు. తెలుగు సాహితీ చరిత్రలో డైరీల రూపంలో 'అతడు-ఆమె' నవలను
రాసి తనదంటూ ప్రత్యేకతని ఆవిష్కరించిన నవలా రచయిత, అనువాదకుడు ఆయన. వృక్ష
శాస్త్రవేత్తగా ఎన్నో ఉన్నత శిఖరాలధిరోహించి సామాజిక నిబద్ధతతో
సాహిత్యకారునిగా మారిన అక్షర సృజనశీలి ఆయన.
ఉప్పల లక్ష్మణరావు 1898 ఆగస్టు 11న ప్రస్తుత ఒడిసా రాష్ట్రం బరంపురంలో జన్మించారు. అక్కడే స్కూలు ఫైనల్ వరకూ చదివారు. 1922లో కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బోటనీ ఆనర్స్‌తో బీఎస్సీ చదివారు. అదే ఏడాది ఆగస్టులో బోటనీలో పై చదువులకు 'ఎడింబరో' వెళ్లారు. అక్కడ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి వృక్షశాస్త్రంలో పరిశోధనలకోసం 'జర్మనీ' వెళ్లారు. అక్కడ 'ట్యూబింగన్' విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసి 1924లో డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. అదే సంవత్సరం స్వదేశానికి చేరుకున్నారు. అప్పట్లో వరహగిరి వెంకటగిరి (వి.వి.గిరి) నాయకత్వంలో బిఎస్‌ఆర్ రైల్వేమెన్స్ యూనియన్ సార్వత్రిక సమ్మె ప్రారంభదశలో ఉండేది. ఆయన కోరిక మీద వి.వి.గిరికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత మూడు నాలుగేళ్లపాటు సర్ జగదీశ్ చంద్రబోస్ పర్యవేక్షణలో వృక్షశాస్త్రంలో పరిశోధనలు చేశారు. అనంతరం కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో వృక్షశాస్త్ర విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఉద్యోగానంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకొని 'ఆలీఘర్' విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు.
ఆ సమయానికి గాంధీ నాయకత్వాన జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితులై, ఖాదీ పరిశ్రమపై పరిశోధన జరపడానికి సబర్మతి ఆశ్రమంలో చేరారు. అక్కడ ఒక ఏడాదిపాటు పరిశోధనలు చేసి సన్న నూలుకు కేంద్రమైన శ్రీకాకుళం- పొందూరు చేరుకున్నారు. నాలుగేళ్లపాటు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటూ సన్న నూలు నాణ్యతను బట్టి సరైన కూలిని నిర్ణయించడం తదితర అంశాలమీద పరిశోధనలు చేశారు. ఈ విషయాలపై తెలుగులో 'భారతి' పత్రికలోనూ, ఇంగ్లీషులో 'మోడరన్ రివ్యూ' పత్రికలోనూ వ్యాసాలు రాశారు. 1937లో తన స్నేహితురాలైన మెల్లీ షోలింగర్‌ని మాస్కోలో వివాహం చేసుకున్నారు. ఆంధ్రా సిమెంట్స్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేసి 1954లో ఉద్యోగాన్ని వదిలేసారు.
ఉప్పల లక్ష్మణరావు ఉద్యోగ బాధ్యతల నుంచి బయటకొచ్చాక విదేశీ సాహిత్యం, తెలుగు సాహిత్యంపై అభిమానాన్ని పెంచుకుని అధ్యయనం చేశారు. 1954లో ప్రఖ్యాత జర్మన్ విప్లవకవి హెన్రిచ్ హైనే కవిత్వంపై జర్మనీలో జరిగిన ఆంతర్జాతీయ సాహిత్య మహాసభలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు.
ఉప్పల లక్ష్మణరావు, ఆయన భార్య మెల్లీ షోలింగర్‌లు 1958లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. మెల్లీ షోలింగర్ అంతకుముందే భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. అప్పటికే ఆయన రాసిన 'అతడు-ఆమె' నవల వెలువడింది. మూడు భాగాలుగా ఉండే ఈ నవల భారత స్వాతంత్య్ర పోరాటాన్ని చిత్రీకరించే చారిత్రిక నవల. ఇది పలు సాహితీసంస్థలు, పత్రికలు విడుదల చేసిన 'చదవవలసిన తెలుగు పుస్తకాల జాబితా'లో చోటుచేసుకుంది.
మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకునిగా 1970 వరకూ పనిచేశారు. నలభైకి పైగా రష్యన్ గ్రంథాలను తెలుగులో అందించారు. వీటిలో లెనిన్ రచనలు, మార్క్స్ వ్యాసావళి, మాక్సిమ్ గోర్కీ రచనలు, చింగిస్ ఐత్మాతోవ్ రచనలు, బాల సాహిత్యం, పాపులర్ సైన్స్ పుస్తకాలు ముఖ్యమైనవి. ఆయన రూపొందించిన 'తెలుగు- రష్యన్ నిఘంటువు' ఇప్పటికీ ప్రామాణికతలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. మాస్కోలో ఉన్నప్పుడే ఆయన భార్య మెల్లీ షోలింగర్ 1965 జూన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అక్కడికి ఐదేళ్ల తర్వాత ఆయన 1970లో తిరిగి బరంపురం చేరుకున్నారు. అక్కడున్న 'వికాసం' సాహితీ సంస్థలో చేరి పదేళ్లపాటు దానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. తన జీవితానుభవాలన్నింటినీ 'బతుకు పుస్తకం' పేరుతో రాశారు. చివరివరకూ సాహితీ 'వికాసం' పొందుతూ ఉప్పల లక్ష్మణరావు1985లో మరణించారు.
---- బెందాళం క్రిష్ణారావు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి