రెండు , మూడు ఏళ్ళ క్రితం అనుకుంటా ఒక యువ జర్నలిస్ట్, ఒకప్పటి తెలంగాణ పోరాట యోధుడు , బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ మీద రీసెర్చ్ చేస్తున్నానని, అతను స్టూడెంట్ గా వున్నపుడు ఎం.ఎన్. రాయ్ రచనలు చదివాడటా అని దాని గురించి నన్ను అడగడానికి నాదగ్గరికి వచ్చాడు. వాస్తవానికి షోయబుల్లా ఖాన్ గురించి అంతకుముందే తెలిసి అభిమానమున్న నాకు , అతను రాయ్ రచనలు చదివాడని తెలిసి ఇంకా ఆసక్తి పెరిగింది.
1947 కు ముందు ఎం.ఎన్.రాయ్ ప్రారంభించిన "Independent India " పత్రికను
చదివేవాడని తెలిసింది . ఎం.ఎన్.రాయ్ ఎడిటర్ గా వున్న అప్పటి ఆ పత్రిక ని
అప్పుడు స్టూడెంట్ గా వున్న షొయబుల్లాఖాన్ అందరికి పంచేవాడని తెలవడం కూడా
నన్ను మరింత ఆసక్తి చూయించేట్లు చేసింది. స్వతంత్రం వచ్చిన తరువాత పేరు
మార్చుకొని రాడికల్ హ్యూమనిస్ట్ పేరుతో ఆ పత్రిక ఇప్పడికీ వస్తుంది .
58 ఏళ్ళుగా ఆ పత్రికకు నేను రెగ్యులర్ చందాదారుడైన పాఠకుడిగా నేను, నాకు
బాగా తెలిసిన ఇప్పటి రాడికల్ హ్యూమనిస్ట్ పత్రిక ఎడిటర్ని సంప్రదించి 1940
ల నాటి ఆ పత్రిక కాపీలను జిరాక్స్ తెప్పించి నా దగ్గరికి వచ్చిన
జర్నలిస్ట్ కు ఇచ్చాను . నిన్న నాకు నా మిత్రులు చంద్రమౌళీ గారు షోయబుల్లా
ఖాన్ మీద మందుముల నరసింగరావ్ రాసిన ఇంకో ఆర్టికల్ ని (50 సంవత్సరాల
హైద్రబాద్ అనె పుస్తకంలోని ) మేయిల్ చెసాడు .అది చదివిన నాకు
మళ్ళీ ఆ జ్ఞాపకాలు మరోసారి నా కళ్ళముందు కదిలినట్లు అనిపించింది . ఆ
వ్యాసాన్ని ఈ పూర్తి వ్యాసం కింద లింక్ లో ఇస్తున్నాను. నిర్దాక్షిన్యమైన
చరిత్రరథం తన గమనంలో ఎందరో మహానుభావులను ఎక్కించికోకుండానే
వెల్లిపోతుంటుంది పక్షపాతంగా. అటువంటి వారిలో షోయబుల్లా ఖాన్ ఒకరు . ఆ రథం
మెడలు వంచి ఇటువంటి మహానుభావుల్ని ఎక్కించాలి. అట్లా కనిపించని వారు ఈ
ప్రపంచంలో ఇంకెంతమంది వున్నారో.
అంతెందుకు షోయబుల్లా ఖాన్ మీదా ఇంటెర్నెట్ అంతా వెదికినా ఒక్క ఫోటో కానీ, వీకీపీడియాలో అతని చరిత్ర కానీ దొరకదు మనకు . 1990 ల్లో నటరాజన్ అనే అతను అమేరికా నుండి వచ్చి ఒక డాక్యుమెంటరీ తీస్తే ఇంతకీ అది ఎక్కడుందో కూడా తెలియదు. దాన్ని అన్ని భాషల్లోకి అనువదించమని అప్పటి ప్రదాని పి.వి.నరసిమ్హారావు ని అడిగిన కాళోజి మాట ఏమయ్యిందో ఇప్పటికీ తెలియదు. ఇంతకీ అతని గురించి తెలియని చాలా విషయాలు కింద లింక్స్ లో వున్నాయి. మీరే నిర్ణయించండి అతని త్యాగం , గొప్పదనం .
The following article is from TV-10
" షోయబుల్లా ఖాన్ ..కలాన్ని ఖడ్గంగా చేసి పోరాడిన యోధుడు ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన యుద్ధం ప్రకటించిన యువ ఉర్దూ జర్నలిస్టు. నడిపేది చాలా చిన్న దినపత్రిక. వయసు 30 ఏళ్ళు కూడా నిండలేదు. కానీ ఆయన పదునైన రాతలు ఆనాటి నిరంకుశ నిజాం పాలకుల గుండెల్లో వణుకు పుట్టించాయి. షోయబ్ నడిపే పత్రికలో వచ్చే కథనాలు ప్రజా కంటక నిజాం ముష్కరులపై కొదమ సింగాలై లంఘించాయి. అయితే తాను ఢీకొంటున్నది ఎవరితోనన్నది ఆ పాత్రికేయుడికి తెలియంది కాదు. అక్కడున్నది ఎంతకైనా తెగించే దుర్మార్గమైన ప్రభుత్వం. తాను ఒక వ్యక్తి. కొండను ఢీకొట్టే పొటేలు పరిస్థితి. అయినా అతను అదరలేదు, బెదరలేదు, వెరవలేదు. భయం అన్నది ఆ రక్తం లోనే లేదు. షోయబుల్లాఖాన్ నిఖార్సయిన జాతీయవాది. ఈ కష్టతరమైన మార్గంలో చావు ఎదురైనా భయపడనని ఆయన మిత్రులతో తరచూ అనేవాడు. బెదిరింపులను ఖాతరు చేయకుండా ముందుకే సాగాడు.అక్షరాలను ఆయుధాలుగా మలచుకొని దుర్మార్గ, దురంహకార, దోపిడీ పాలనపై పోరాటం చేశాడు. చరిత్ర గర్వించదగ్గ పాత్రికేయుడిగా షోయబుల్లాఖాన్ నిలిచిపోయాడు..
షోయబ్ ప్రస్ధానం..
షోయబుల్లాఖాన్ అక్టోబర్ 17వ తేదిన 1920 వ సంవత్సరంలోఖమ్మం జిల్లా సుభ్రవేడు గ్రామంలో జన్మించాడు. తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడింది. షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు. షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు. బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు.
తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబుల్లా తండ్రి మురిసిపోయేవాడు. ఈ కారణం చేతనే షోయబ్ ను ఆయన ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు.
పాత్రికేయునిగా..
చాలామందికి వృత్తి కేవలం బతుకుదెరువు కోసంమాత్రమే. కానీ, చిన్నతనం నుంచి సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ కు తన వృత్తి, ప్రవృత్తి, తన జీవితం అంతా ఒక్కటే. అదే జర్నలిజమ్. నిజాం సంస్థానంలో మంచి ప్రభుత్వోద్యోగం దొరికే అవకాశముంది. కానీ, దాన్ని వదులుకున్నాడు. జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట షోయబ్ తేజ్ అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. అప్పటికే ఆ పత్రిక ప్రజల్లో జాతీయ భావాలను నింపే పని చేస్తోంది. ఉరకలేసే ఉత్సాహంతో ఉన్న షోయబ్ తనకు సరైన వేదికే దొరికిందనుకున్నాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. ఇది పాలకులకు నచ్చలేదు. ప్రజలు తమను ప్రశ్నించే పరిస్థితి రాకమందే జాగ్రత్త పడాలనుకున్నారు. అనేకానేక ప్రయత్నాలు చేసి చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.
నిజాం పాలనపై రాజీలేని పోరాటం...
షోయబ్ లో పట్టుదల అపారం. తన లక్ష్యం వైపు పయనంలో అలుపెరుగని పరుగు సాగించాడు. తాను పనిచేస్తున్న పత్రిక నిషేదానికి గురైనా షోయబ్ వెనక్కు తగ్గలేదు. పైగా పట్టుదల మరింత పెరిగింది. పత్రికల నోళ్ళు మూయించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలనుకుంటున్న నిజాం పాలకులపై రాజీలేని పోరాటం చేయాలనుకున్నాడు. తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. తనదైన శైలిలోనే, తాను నమ్ముకున్న మార్గంలోనే వార్తా రచన సాగించాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది.
..
స్వంత పత్రిక ఇమ్రోజ్..
ఎదురు దెబ్బలు ఎన్నెదురైనా షోయబ్ జర్నలిజాన్ని , జాతీయవాద మార్గాన్ని వదలలేదు. సొంతంగా పత్రిక ప్రారంభించాలని అనుకున్నాడు. కానీ అందుకు ఆయన దగ్గర సరిపడా డబ్బులేదు. ఉన్నదల్లా ఒక్కటే. గుండెనిండా ధైర్యం. అప్పుడాయన తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. చాలా పనులు ప్రారంభించడం తేలిక. వాటిని కొనసాగించడమే కష్టం. కానీ పత్రికల విషయంలో రెండూ కష్టమే. సరిగ్గా ‘ ఇమ్రోజ్’ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆర్థిక సమస్యల సుడిగుండాలు చుట్టుముట్టినా, తీవ్ర ఇబ్బందులు ఎదురైనా షోయబ్ మాత్రం ‘ఇమ్రోజ్ ’ పట్టుదలతో నడిపాడు. ప్రజల పత్రికగా తీర్చిదిద్దాడు.
విలీన సమయంలో..
షోయబ్ ‘ఇమ్రోజ్’ పత్రిక ప్రారంభించడానికి కొన్ని నెలల ముందే బ్రిటీష్ పాలకుల శృంఖలాలను తెంచుకుని భారతావని స్వేఛ్ఛావాయువులు పీల్చింది. దేశమంతటా జాతీయ స్ఫూర్తి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయమది. దేశంలోని అనేక సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలు భారత్ లో విలీనం అవుతున్నాయి. కానీ ఆ సమయంలోనూ నిజాం పాలనలోని ప్రజలు సంతోషంగా లేరు. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యం వారికి దక్కలేదు. నిజాం రాజు తన రాజ్యాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడానికి తిరస్కరించాడు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం భగ్గుమంది. ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. నిజాంపై సమరభేరీ మోగింది. ఆ సమయంలో ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి నిజాం రాజు తరపున రజాకార్లు రంగంలోకి దిగారు. తీవ్రమైన దమనకాండకు పాల్పడ్డారు. ఊళ్ళలో పడి ఆడా , మగ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా తీవ్రంగా కొట్టారు. అరాచకం సృష్టించారు. దీంతో షోయబ్ తన బాధ్యత మరింత పెరిగిందని భావించాడు. సమయానికి తగిన విధంగా తన వార్తా కథనాల కరుకుదనానికి మరింత పదును పెంచాడు. ప్రజా కంటక నిజాం పాలకులపై, ప్రజలను దోచుకుతింటున్న రజాకార్లపై అక్షరాయుధాలు సంధించాడు. పిడుగుల్లాంటి వార్తలు కురిపించాడు. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు.
విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. విలీనానికి నిజాం రాజు వ్యతిరేఖించడంలో వెనక ఉన్న స్వార్థ రాజకీయాలను ఎండగట్టాడు. మతం ముసుగులో నిజాం చేస్తున్న దుష్ట రాజకీయాలను బద్దలు కొట్టాడు. పాలకులకు వ్యతిరేకంగా షోయబ్ సాగిస్తున్న యజ్నం నిజాంను, నిజాం తొత్తులను వణికించింది. ఫలితం అక్షర యోధుణ్ని అంతం చేసే కుట్రలు మొదలయ్యాయి. ‘ఇమ్రోజ్’లో వస్తున్న వార్తలు, వ్యాఖ్యలు, వ్యాసాలు, సంపాదకీయాలు నిజాం పాలకులకు మింగుడుపడలేదు. తమ మతానికే చెందిన షోయబుల్లాఖాన్ తమకు వ్యతిరేఖంగా వార్తలు రాయడమే వారు జీర్ణించుకోలేకపోయారు. ఏదో రకంగా నచ్చచెప్పి ఈ రాతలను ఆపాలని విఫల ప్రయత్నాలు చేశారు. బుజ్జగించారు. బెదిరించారు. కానీ షోయబుల్లాఖాన్ కలం కరుకుదనం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు.
‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసం రాశాడు. ఈరోజు తెలంగాణా గ్రామాలలో ప్రజలు నిజాం ప్రభుత్వ తిరగలిలో పడి పిండి చేయబడుతున్నారు. ఇత్తెహుదల్ సభ్యులు గాంధీ టోపీలు ధరించి గాంధీజికి జై అంటూ గ్రామాలలో దోచుకుంటున్నారు. పాలకులు వీరికి అండగా ఉంటున్నారు. ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? ప్రజలందరికీప్రాతినిధ్యం వహించే మంత్రివర్గం ఎందుకు ఏర్పాటు చేయదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు. కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా ఆ వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు.
మరోవైపు 1946 నుంచే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగుతోంది. ప్రభుత్వ, భూస్వామ్య పునాదులు కదులుతున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ సోషలిస్టులు, ఆర్యసమాజ్ వారు సత్యాగ్రహ పోరాటాలు ఉధృతం చేశారు. మరోవైపు నిజాం ప్రభుత్వంలో పనిచేసిన సివిల్ ఉద్యోగులు, ముస్లిం మేధావులు నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయాల్సిందేనని బాహాటంగానే అంటున్నారు. వీటన్నింటినీ షోయబ్ తన ‘ఇమ్రోజ్’ పత్రికలో ప్రచురించాడు. ఈ రచనలు నిజాం పాలకుల్లో ఆగ్రహం తెప్పించాయి. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 వ తేదీన ఒక సభలో షోయబ్ పై ఉన్న కక్షనంగా వెళ్ళగక్కాడు. తమపై విమర్శలు చేస్తూ చూపించే చేతులు నరికివేస్తామన్నాడు. ఖాసీం రజ్వీ హెచ్చరికలతో కూడిన ప్రసంగం జరిగిన రెండో రోజునే పాలకుల కుట్ర పథకం అమలైంది.
షోయబ్ హత్య..
1948 ఆగస్టు 21వ తేదిన షోయబ్ ఎప్పటిలాగే తన అనుచరుడితో రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ లో పనులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాడు. పత్రిక కార్యాలయం కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉంది. షోయబ్ రాకను గమనించి అందుకోసమే పొంచివున్న కొందరు ముష్కరులు ఒక్కసారిగా వీరిపై కత్తులతో దాడిచేశారు. షోయబ్ పై కాల్పులు జరిపారు. ఆయన ఛాతీలోంచి రెండు తూటాలు దూసుకెళ్ళాయి. ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. వేయి మెదళ్ళను కదిలించే సిరా చుక్కలు రక్తంలో కలిసిపోయాయి.కాలం ఘనీభవించింది. భయమంటే తెలియని , సాహసమే ఊపిరిగా నిలిచిన ఆ కలం వీరుడు నేల కొరిగాడు. ప్రజల పక్షాన దౌర్జన్యాలపై గర్జించే కలం మూగబోయింది. రక్తపు మడుగులో పడిఉన్న షోయబ్ ను అక్కడున్న కొందరు ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. 1948 ఆగస్టు 22న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.
తమ కోసం సర్వస్వాన్ని, చివరకు ప్రాణాలు అర్పించిన కలం యోధున్ని కడసారిగా చూసుకుని నివాళులర్పించే అవకాశం కూడా లేకుండా చేసింది కర్కశ నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేదించింది. ఆఖరి వీడ్కోలులో కొద్దిమంది మిత్రులు, బంధువులు మాత్రమే పాల్గొన్నారు. అశేష ప్రజా సమూహం మధ్య సాగాల్సిన అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట స్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు. ఈ హత్య రాజకీయ కారణాల వల్ల జరగలేదని, వ్యక్తిగత కక్షలే ఇందుకు కారణమని చెప్పి వాస్తవాలను పాతరేసింది. తన పాశవికతను చాటుకుంది. మత సామరస్యం, దేశ సమగ్రత కోసం కలాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడి, అదే లక్ష్య సాధనలో అసువులు బాసిన యువ పాత్రికేయ యోధుడు షోయబుల్లాఖాన్. ఆయన మార్గం అనితర సాధ్యం. "
Please read the following link what Mundumoola narsinga Rao says
1. From Mundumoola narsinga Rao : http://www.scribd.com/…/50-Samvatsarala-Hyd-on-Shoebullah-K…
2. From TV-10 ( Video link ) : http://www.10tv.in/…/Telangana-Rebellion-Shoaibullah-Khan-F…
( ఆధారంః సొషల్ మీడియా లో రావెల సోమయ్య గారు ఇచ్చిన సమాచారం )

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి