బహుజన రచయితల వేదిక శ్రీకాకుళం అధ్వర్యంలో జిల్లా సలహాదారు దుప్పల రవికుమార్ నడుపుతున్న పద్మావతీ జూనియర్ కళాశాల కు చెందిన 150 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధినీ విద్యార్ధులకు బరవే రాష్ట్ర సలహాదారులు డా.పి.సుబ్బారావ్ గారు & సత్యం కొల్లాబత్తుల అంబేడ్కర్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫూలే అంబేద్కర్ భావజాలాన్ని పరిచయం చేసారు. ఎస్సి, ఎస్టి, బిసి వర్గాలకు చెందిన విద్యార్ధినీ విద్యార్ధులకు ముందుగా వారి కి భవిష్యత్తులో ఉన్న అవకాశాల గురించి, ఆటిట్యూడ్ అండ్ కెరీర్ గైడెన్స్ గురించి వివరించినతరువాట అతి తక్కువ కులంలో పుట్టిన అంబేద్కర్ కస్తాలకు ఎదురొడ్డి ఎలా చదువు కొన్నారో..తన చదువుని మన హక్కుల కోసం ఎలా ఉపయోగించి తన జీవితాన్ని త్యాగం చేసారో వివరించారు. కులం లేకుండా చెయ్యడానికి ఆయన మాస్టర్ కీ అయిన అధికారాన్ని చేపట్టాలని ఇచ్చిన పిలుపుని అందుకుని కాన్షీరాం జీ ఎలా విజయం సాధించారో వివరించారు. త్వరలో ఓటు హక్కు రాబోతున్న తాము ఎలా అంబేద్కర్ ఆశయంతో పనిచేసే పార్టీలకు ఓట్లు వేసి తమ తల్లి తండ్రుల చేత వేయించి అంబేద్కర్ ఆశయాన్ని ఎలా నెరవేర్చాలో వివరించారు. మూడు గంటల పాటు చాలా శ్రద్ధగా విన్న విద్యార్ధినీ విద్యార్ధులు ఎన్నో ప్రశ్నలో మమ్మల్ని ఇంకా ఉత్సాహ పరిచారు. కొత్త నోటు పై బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కాకుండా గాంధీ ఫోటో ఎందుకుంది అని ఒక విద్యార్ధిని అడిగిన ప్రశ్నకు పూనా ఒప్పందంలో దళితులకు, శూద్రులకు అధికారం రాకుండా చేసి ఎవరితరుపున సంతకం చేశాడో వాళ్ళే పరిపాలిస్తుండడం వల్ల గాంధీ బొమ్మ ముద్రించారని, త్వరలో వాళ్ళే అధికారంలో కి వచ్చి అంబేద్కర్ బొమ్మ ముద్రించు కుంటామని వాళ్ళే సమాధానం చెప్పారు. ఇంత అద్బుతమైన కార్యక్రమానికి అవకాశమిచ్చిన దుప్పల రవికుమార్ కు, నీలకంటం గారికి చాలా చాలా ధన్యవాదాలు అండ్ జై భీంలు ..
6, డిసెంబర్ 2016, మంగళవారం
ఫూలే , అంబేద్కర్ల పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి