భర్త చనిపోతే భార్య బొట్టు ఎందుకు చెరపాలి? గాజులెందుకు పగలగొట్టాలి? ఆమెను బతికి ఉన్న శవంలా ఎందుకు మార్చాలి? తోడు నీడలా ఉన్న భర్త మరణించి పుట్టెడు దు:ఖంలో ఉన్న స్త్రీని అనునయించి, ఆదరించాల్సిన సమాజం నిర్దయగా అమానవీయమైన ఆంక్షలు ఎందుకు విధిస్తున్నట్లు? భారతీయ సంస్కృతిలోని ఈ ఆచారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
సమాజంలో సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి తరతరాల నుండి వస్తున్నాయి. వేరే
చోట ఏమో కాని భారత దేశంలో మాత్రం ఎక్కువ ఆచారాలు, కట్టుబాట్లు అనేవి
మహిళలను అణచడానికి, బాధపెట్టడానికే ప్రతిపాదించారా అనిపిస్తుంది. కులాలు,
మతాలను బట్టి విభిన్న సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మనదేశంలో హిందు
మతస్తులు ఎక్కువ కాబట్టి ఆ సంప్రదాయాలను అనుసరించేవారు అత్యధికంగా ఉన్నారు.
ఆచారం, సంప్రదాయం మన జీవన విధానాన్ని ఆనందమయం చేయాలే కాని అవమానించి
ఏడిపించకూడదు. హిందు మతంలోని చాలా ఆచారాలు ఇట్లా ఇబ్బంది పెట్టేవే. అటువంటి
ఆచారాలను సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవాలి. ఒకప్పుడు మహిళలను సతీసహగమనం
పేరుతో భర్త చితిమంటల్లో కాల్చి చంపేవారు. అది ఇప్పటివరకు కొనసాగుతూ ఉండి
ఉంటే ఈ సమాజం ఇప్పుడు ఎలా ఉండేదో మనం ఊహించనైనా ఊహించలేం. ఇప్పుడు ఉన్న
మనలో చాలా మంది కనీసం పుట్టనైనా పుట్టేవాళ్ళం కాదేమో. సతీసహగమనం లాంటి
దుర్మార్గమైన ఆచారానికి వ్యతిరేకంగా ఎందరో సంఘసంస్కర్తలు పోరాటాలు చేయడంతో
కాలక్రమేణ అది కనుమరుగయింది.
దేశం సైన్స్, టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతుందని మన మేధావులు చంకలు గుద్దుకుంటున్నారు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా మని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయినా ఏం ప్రయోజనం? ఛాందస భావాలను మాత్రం వదలలేక పోతున్నారు. ఎంతమార్పు వచ్చినా స్త్రీలపై రుద్దిన ఆచారాలు కట్టుబాట్ల పట్టు మాత్రం సడలటం లేదు. కొన్ని ఆచారాలు ఎంత దారుణంగా ఉంటా యంటే... ఆడకూతురు బోరున విలపిస్తున్నా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఆచారాలను అమలు జరపడం జరుగుతోంది. ఇంత దారుణానికి ఎందుకు ఒడిగడుతున్నారంటే... ఆచారం అంటున్నారు. ఆచారాన్ని పాటించకపోతే అరిష్టం అంటున్నారు. భర్త చనిపోతే భార్య జీవితాన్ని నరకప్రాయం చేస్తోంది హిందు సాంప్రదాయ సమాజం. ఈ పరిస్థితి నుంచి స్త్రీలను కాపాడటానికి పోరాటం చేయవలసి ఉంది.
సంస్కృతి అంటూ నూరిపోస్తారు..
హిందు సాంప్రదాయంలో బొట్టు, గాజులు అనేవి విడదీయరాని భాగాలుగా తయారయ్యాయి. దీనితో పాటు చెవులు కుట్టియ్యడం, ముక్కులు కుట్టియ్యడం కూడా ఆడపిల్లలకు ప్రత్యేకం. పిల్లల్ని వాటితో అవినాభావ సంబంధం ఉన్నట్లు ఆలోచింపచేస్తారు. శరీరంలో అవి ఒక భాగం అన్నట్లు స్త్రీలు భావించేలా చేస్తారు. వివాహం తరువాత మరికొన్ని జతవుతాయి. తాళిబొట్టు, మట్టెలు పెండ్లి అయిన స్త్రీ ఎల్లప్పుడూ ధరించాల్సిన పవిత్ర ఆభరణాలుగా అమ్మాయిలకు నూరిపోస్తారు. నిజానికి వీటిని ఆభరణాలు అనడం తప్పే. ఇవి ఒక స్త్రీకి పెండ్లి అయినందుకు గుర్తులు. 'ఈ స్త్రీకి పెండ్లయిపోయింది. ఓ పురుషుని సొత్తు' అని చూసేవారికి చాటిచెప్పే గుర్తులివి. మరి పెండ్లైన పురుషులకు ఇటువంటి గుర్తులను ఎందుకు పెట్టలేదో! పుట్టుక నుంచి ఇట్లా సంస్కృతి పేర అలవాటుచేసిన కట్టు బొట్టులను అతి దారుణంగా వారి నుంచి లాగేసుకొనే సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
వితంతువుగా మార్చడం ఓ అమానవీయ కృత్యం
భర్త చనిపోయిన తరువాత అప్పటివరకు ఏవైతే సౌభాగ్యాన్ని కలిగిస్తాయని స్త్రీని నమ్మిస్తూ వచ్చారో వాటిని బలవంతంగా ఆమె దగ్గరి నుంచి లాగేసుకుంటారు. భర్త చనిపోయిన తొమ్మిదోరోజు ఈ తంతంగం మొదలుపెడుతారు. ముతైదువుల చేతుల మీదుగా ఆరోజు గాజులు తొడిగించి, పూలు, కుంకుమ, పసుపు పెట్టి కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు చివరిసారిగా ఆమె ముఖం చూస్తారు. ఆమె జీవితంలో సౌభాగ్యవతిగా అది చివరి రోజు. ఆ తరువాత ఎప్పటికీ ఆమె మళ్ళీ పసుపు కుంకుమలు ధరించే అవకాశం లేని విధవరాలు అవుతుంది. ఆ రోజు ఊరు బయట చెట్టు కిందకు తీసుకెళ్ళి ముసుగు కప్పి కూర్చోపెడుతారు. ముత్తెదువులు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళను అక్కడినుండి దూరంగా వెళ్ళమంటారు. పురుషులు అయితే అక్కడ అసలు ఉండరు. రజక కులానికి చెందిన మహిళతో బొట్టు చెరిపించి గాజులు పగలగొట్టిస్తారు. పూలచెండును తెంపేస్తారు. ఆ సమయంలో భర్తను కోల్పోయిన స్త్రీ బాధ వర్ణనాతీతం. తెల్లటి చీరను కట్టి, తెల్లటి బొట్టు పెట్టి, లోహపు గాజులు తొడిగి అమానవీయ స్థితిలోకి ఆమెను నెట్టివేస్తారు. ఆమె ముఖం ఎవరికీ కనిపించకుండా చీరకొంగును కప్పుతారు. అంతటితో ఈ తతంగం ముగిసిపోదు.
పుట్టెడు దు:ఖంతో విల విల లాడుతున్న ఆ స్త్రీమూర్తి ముసుగుతీసి చుట్టూ చిల్లరడబ్బులు తిప్పి ఆమె చేతిలో పెడుత్తుంటారు ముత్తైదువులు. ఆ ముసుగుతో ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజంతా బయటికి వెళ్ళనివ్వరు.
ఇదేం సంస్కృతి?
ఏ ఉద్దేశంతో ఈ తతంగాన్ని ఆచారంగా మార్చారు? ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండటం, వితంతు పునర్వివాహాలు లేకపోవడం వల్ల లేత వయసులోనే ఉన్న అమ్మాయిల భర్తలు చనిపోయినప్పుడు ఒక కుట్రతో ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టారు. హిందు సాంప్రదాయ వాదులు బొట్టు, కాటుక, గాజులు, పూలు పెట్టుకొని, రంగు రంగుల చీరలు కట్టుకొని తిరగటం అందానికి నిర్వచనం చేశారు. అవన్నీ పెట్టుకున్న స్తీ అందంగా ఉంటుందనే ప్రచారం చేశారు. ఇవన్నీ ధరించి తిరిగిన స్త్రీకి వీటిని దూరం చేస్తే ముఖం బోసిపోయి వికారంగా ఉంటుందనేది వారి నమ్మకం. ఇటువంటి సాదా సీదాగా ఉన్న వితంతువులవైపు ఇతర పురుషులు ఆకర్షితులు కారనేది ఇందులో దాగి ఉన్న మర్మం.
అదే సమయంలో వితంతువులు శుభకార్యాలకు రాకూడదని, ఎదురు రాకూడదని... ఉన్న అనేక ఆంక్షలు కూడా జనంలో కలవకుండా... మరీ ముఖ్యంగా పురుషులకు దూరంగా వితంతువును ఉంచడానికే. ఇప్పుడు చాలా మంది భర్త చనిపోయిన స్త్రీలు మళ్ళీ వివాహం చేసుకుంటున్నారు. అటువంటప్పుడు ఎప్పుడో కుట్రపూరితంగా పెట్టిన వితంతువుగా మార్చే తంతును ఇంకా కొనసాగించడంలో అర్థం ఏముంది? ఇదేం సంస్కృతి?
- ఎమ్.సంధ్య, 9160688769 (నవ తెలంగాణ 26.4.2016)

very useful item.....congrats....
రిప్లయితొలగించండి